Friday, December 5, 2014

బతుకు పయనం


బతుకు పయనం

నిశ్శబ్దంలో ఒక శబ్దం, గుండె చప్పుడు లయతో
నిర్లిప్తతలో ఒక భావం, పెదవి దాటని మాటలతో
నిరాశలో ఒక ఆశ, కోర్కెలు తొలిచే అంతరంగంలో
ఓటమిలో ఒక పాఠం అనుభవాల ఆరోహణలో
అగమ్యంలో ఒక  గమ్యం క్రొత్త దారుల అన్వేషణలో
అయోమయంలో ఒక సమయం కర్తవ్య అవగతంలో
అనుబంధంలో ఒక బంధం అంతు చిక్కని ఆనందానికై
కాలగతిలో ఒక  గమనం సుఖదుఖాల ఒరవడికై
జీవితంలో ఒక లక్ష్యం భావి బతుకున మనశ్శాంతికై


No comments:

Post a Comment